అత్యధిక, అత్యల్ప మెజారిటీ వీరిదే
లక్ష్మణచాంద: జిల్లాలో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మణచాంద సర్పంచ్‌గా ఓస కవిత భారీ మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మండలంలో ఏకై క మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మణచాంద సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. గ్రామంలో మొత్తం ఓటర్లు 4,354 ఉండగా గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,355 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఓస కవిత ఏకంగా 1,840 ఓట్లు సాధించి తన సమీప అభ్యర్థి సుకన్యపై 1,123 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిన సర్పంచ్‌గా చరిత్ర సృష్టించింది.
స్వల్ప మెజారిటీతో..
లక్ష్మణచాంద మండలంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. బాబాపూర్ గ్రామంలో మొత్తం 891 ఓటర్లు ఉండగా ఇందులో 708 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో పడిగెల లక్ష్మికి 271 ఓట్లు, గుండాల లలితకు 263 ఓట్లు వచ్చాయి. లక్ష్మి కేవలం 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. న్యూకంజర్ గ్రామంలో 384 ఓటర్లు ఉన్నారు. 319 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మద్దు మోహన్‌రెడ్డికి 136 ఓట్లు, లక్ష్మారెడ్డికి 127 ఓట్లు వచ్చాయి. మోహన్‌రెడ్డి 9 ఓట్లతో విజయం సాధించారు.


