ముందే ఓటేశారు
లోకేశ్వరం: ఈనెల 14 జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, ఉద్యోగులు శుక్రవారం వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. లోకేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బ్యాక్స్‌లో ఓటు వేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైయినీలు దేవేందర్, మురళీధర్ ఉన్నారు.
కుంటాలలో..
కుంటాల: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కుంటాల మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 10 నుంచి శుక్రవారం వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ ఓటు వేశారు. బుధవారం 02, గురువారం 01, శుక్రవారం 46 మొత్తం 49 మంది పోస్టల్ ఓట్లు పోలయ్యాయని జిల్లా ఎన్నికల అదనపు అధికారి అల్లాడి వనజ తెలిపారు.
ముందే ఓటేశారు


