అవగాహన కల్పించాలి
ఈ ఏడాది భూమిలో తేమ ఉండడంతో యాసంగిలో వేసుకున్న శనగ, మొక్కజొన్న, పెద్దజొన్న పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే మరిన్ని దిగుడులు సాధిస్తాం. – అశోక్, రైతు, హిప్నెల్లి
అవగాహన కల్పిస్తాం
రైతులు యాసంగిలో సాగు చేసిన శనగ, మొక్కజొన్న, పెద్ద జొన్న, కుసుమ, కూరగాయల పంటలను వ్యవసాయాధికారులు పరిశీలిస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ఏఈవోలతో రైతులకు అవగాహన కల్పించేలా చూస్తాం. కొన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో యాసంగి సాగు కాలేదు. కొన్నిచోట్ల మొక్కజొన్న, వరి సాగు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఏఈవో పోస్టులు భర్తీ చేసి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
– అంజిప్రసాద్, డీఏవో


