ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
పెంబి: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూ చించారు. బుధవారం మండల కేంద్రంలోని జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటర్లవా రీగా సిబ్బందికి కేటాయించిన సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్ని కల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు. గురువారం ఎన్నికలు ముగిసిన అనంతరం సామగ్రిని అ ధికారులకు అప్పగించాలని సూచించా రు. ఏఎస్పీలు రాజేశ్‌మీనా, ఉపేందర్‌రె డ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, మండల ప్రత్యేకాధికారి నరసింహారెడ్డి, జిల్లా విద్యాశా ఖ అధికారి భోజన్న, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
ఖానాపూర్ పట్టణంలో..
ఖానాపూర్: పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు)లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు. కౌంటర్లు, పోలింగ్ సామగ్రిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుపాలని సూచించారు.


