కూలీలకు వసతులు కల్పించాలి
సారంగపూర్: కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, పనికి తగిన వేతనం బ్యాంక్ ద్వారా చెల్లించాలని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల కోరారు. మండలంలోని చించోలి(బీ) సమీపంలోని ఇటుకబట్టీని బుధవా రం సందర్శించారు. ఇటీవల కార్మికురాలు భానుమతి ట్రాక్టర్ పైనుంచి పడి మృతిచెందగా నిజనిర్ధారణ కోసం వచ్చినట్లు చెప్పారు. సదరు మహిళ భర్త జగ్‌మండ్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడంతోనే ఆమె మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. బట్టీలో చాలామంది బాలకార్మికులున్నట్లు గుర్తించి చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారమిచ్చామని పేర్కొన్నారు. కార్మికశాఖ అధికారులు ఇటుకబట్టీల్లో పని చేసే వలసకార్మికులకు కనీస వసతులు కల్పించి వారి హక్కులను పరిరక్షించాలని, మృతి చెందిన మహిళ కుటుంబానికి తక్షణమే పరిహారం అందించేలా చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఇటుకబట్టీ యజమానులు శేషాద్రి, వెంకట్‌రెడ్డి నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. యూని యన్ నాయకుడు సయ్యద్ ఇల్యాస్ ఉన్నారు.


