నవోదయ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్ రూరల్: ఈనెల 13న నిర్వహించనున్న నవో దయ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఆ ర్సీ భవనంలో నిర్వహించిన పరీక్ష అధికారుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పరీక్షలో ప్రతీ ప్రొఫా ర్మాను కచ్చితమైన సమాచారంతో పూర్తి చేయాలని తెలిపారు. గదికి 24మంది విద్యార్థుల చొప్పున కే టాయించాలని సూచించారు. ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అ నుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. మెడికల్, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటా రని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే విధానాన్ని కా గజ్‌నగర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


