పంచాయతీ ఎన్నికలు
పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: మొదటి విడత గ్రామపంచాయతీ ఎ న్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, అబ్జర్వర్లతో మంగళవారం వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఏర్పాట్ల వివరాలు అడిగి తెలు సుకున్నారు. సామగ్రి పంపిణీకి పటిష్ట చర్యలు తీ సుకోవాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చే యాలని పేర్కొన్నారు. కేంద్రాలకు 200 మీటర్ల పరి ధిలో ఎవరూ ఉండకుండా చూడాలని తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి..
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఆ రు మండలాల్లో మొదటి దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సరిపడా పోలింగ్ సామగ్రి అందుబాటులో ఉందని, పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం మాట్లాడుతూ మొదటి విడత పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
పటిష్ట బందోబస్తు..
ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ, మొదటి దశ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్ పాల్గొన్నారు.


