ఎన్నికల ఉపాధి
మేనిఫెస్టో ప్రింటింగ్ కోసం పరుగులు డోర్ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలకు మోడల్ బ్యాలెట్‌లకు గిరాకీ.. టోపీలు, కండువాలకు ఆర్డర్లు.. చేతినిండా పని దొరుకుతుందంటున్న తయారీదారులు
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడు దశల్లో జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికలో ఆశావహుల్లో ఉత్సాహం తీసుకురాగా, వివిధ రంగాల వారికి ఉపాధి కూడా తెచ్చాయి. ప్రింటింగ్ ప్రెస్‌లకు గిరాకీ పెరిగింది. మేనిఫెస్టోలు, పాంప్లెంట్లు, డోర్ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతోపాటు కండువాలు, టోపీలకు బరిలో ఉన్నవారు బల్క్ ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పటికే గుర్తులు ఫైనల్ అయిన వారు సింబల్స్‌తో పాంప్లెంట్లు, వాల్, డోర్ స్టిక్కర్లను ముద్రించుకుంటున్నారు. గిరాకీ పెరగడంతో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు తమ షాపులను 24 గంటలు నడిపిస్తున్నారు.
అసెంబ్లీస్థాయి మేనిఫెస్టోలు
సర్పంచ్ పోటీదారులు గ్రామాభివృద్ధి హామీలు, ప్రణాళికలతో కూడిన అధికారిక పత్రాలు రూపొందిస్తున్నారు. వందల సంఖ్యలో మేనిఫెస్టో కరపత్రాలు ముద్రించి ఇంటి డోర్లు అంటిసుతన్నారు. గ్రామస్తులకు, ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు.
అంతటా ఒకే రేటు..
కరోనా తర్వాత ప్రింటింగ్ ప్రెస్‌ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫ్లెక్సీలు రావడంతో కరపత్రాల ప్రింటింగ్ తగ్గిపోయింది. ఎలక్షన్ల సమయంలో మాత్రమే గిరాకీ ఉంటుంది. దీంతో ఆఫ్‌సెట్ ప్రెస్ అసోసియేషన్ నిర్ణయం మేరకు అన్ని ప్రింటింగ్ ప్రెస్‌లు కరపత్రాలకు, పోస్టర్లకు ఒకే రేటు వసూలు చేస్తున్నారు. 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఎన్నికల ఉపాధి


