‘గుర్తు’ంచుకోండి ప్లీజ్..
నిర్మల్‌చైన్‌గేట్: పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 చిహ్నాలు కేటాయించారు. గ్రామీణ ఓటర్లకు సుపరిచితమైనవి అయినప్పటికీ, పోలికలు, అస్పష్టతలు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పేరు మొదటి అక్షరాల ఆధారంగా చిహ్నాలు కేటాయించారు. సర్పంచి బ్యాలెట్ గులాబీ రంగులో, వార్డు సభ్యులది తెలుపు రంగులో ఉంటుంది. ఇష్టం లేని అభ్యర్థికి ’నోటా’ ఎంపిక లభిస్తుంది.
సులభంగా గుర్తించే చిహ్నాలు
సర్పంచి పోటీదారులకు ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, టీవీ రిమోట్, డైమండ్, బ్యాటరీ లైట్ వంటివి ప్రచారానికి అనుకూలం.ఈ గుర్తులు ఓటర్లకు తక్షణ అర్థమవుతాయి. చెత్తడబ్బా–బకెట్, బ్లాక్‌బోర్డు–మంచం, బ్యాట్–స్టంప్స్, గ్యాస్ సిలిండర్–స్టౌ, ఐస్‌క్రీమ్–గాజుగ్లాస్ వంటి దగ్గరి రూపాలు ఓటర్లను గందరగోళం చేస్తాయి. బెండకాయ, టీ జల్లెడ్, చెప్పులు, గరాట వంటివి ప్రచారానికి కష్టం. ఈ నేపథ్యంలో ఇంటింటా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు నిరక్షరాస్యులకు గుర్తును దగ్గరుండి మరీ మోడల్ బ్యాలెట్ పేపర్‌లో చూపిస్తున్నారు. క్రమ సంఖ్య ఆధారంగా గుర్తుంచుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. అయినా.. పోలింగ్ నాటికి ఏం చేస్తారో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
కేటాయించిన గుర్తులు ఇవీ..
సర్పంచి చిహ్నాలు వార్డు సభ్యుల చిహ్నాలు
లేడీ పర్స్, పడవ, వేణువు గౌను, ఈల, కుండ
కొబ్బరి తోట, చేతికర్ర డిష్ యాంటెన్నా, మూకుడు
డోర్ హ్యాండిల్, బ్రష్ పోస్టు డబ్బా, హాకీ కర్ర
బిస్కెట్, గాలిబుడగ బంతి, నెట్, కేటిల్
‘గుర్తు’ంచుకోండి ప్లీజ్..
‘గుర్తు’ంచుకోండి ప్లీజ్..


