ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్
లక్ష్మణచాంద: ప్రభుత్వం పాఠశాల విద్య బలోపేతానికి అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్)అమలు చేస్తోంది. తాజాగా సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా సోమవారం నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతోపాటు, మండల విద్యాధికారి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
కార్యాలయ సమగ్ర సమాచార నిర్వహణ
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, పనితీరు వంటి సమాచార సేకరణ, జోన్‌స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆ డేటా ప్రతిరోజూ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందిస్తూ సమగ్ర సమాచారాన్ని నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 168 మంది..
జిల్లాలో 168 మంది సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సీఆర్పీలు 43 , ఏపీవో 1, సిస్టం అనాలసిస్ట్ 1, టెక్నికల్ పర్సన్ 1, డాటా ఎంట్రీ ఆపరేటర్ 19, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు 13, మెసెంజర్లు 13, ఐఈ ఆర్‌పీఎస్ లు 24, ఆయాలు 9, పీటీఐఎస్‌లు 44 మంది ఉన్నారు.
పకడ్బందీగా అమలు
పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మే రకు జిల్లాలోని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ సోమవారం నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చే స్తున్నాం. ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా ముఖ గుర్తింపు ద్వారా హాజర నమోదు చేసుకోవాలని ఇదివర కే ఆదేశాలు జారీ చేశాం. – భోజన్న, డీఈవో, నిర్మల్


