పల్లె పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సమావేశంలో పాల్గొన్న తహసీల్దార్లు, ఎంపీడీవోలకు మరొకసారి ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై సూచనలు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలింపునకు సరిపడా వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాల ని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారె డ్డి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న పాల్గొన్నారు.


