అడెల్లిలో తగ్గిన భక్తుల రద్దీ
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజమాబాద్, కరీంనగర్, హైదరబాద్, వరంగల్ తదితర ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గతవారంతో పోలిస్తే భక్తుల రద్దీ తగ్గిందని ఈవో భూమయ్య తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. అమ్మవారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ జయరామ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


