హోంగార్డుల సంక్షేమానికి కృషి
నిర్మల్‌టౌన్: హోంగార్డుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి పోలీస్ శాఖ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎస్పీ జానకీషర్మిల అన్నా రు. జిల్లా కేంద్రంలోని సాయుధ దళ పోలీస్ కార్యాలయంలో 63వ హోంగార్డుల రైజింగ్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. మొదట పరేడ్‌తో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా హోంగా ర్డులు ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, లాఅండ్‌ఆర్డర్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు స్పందన, అత్యవసర సేవల్లో నిబద్ధతతో పనిచేసే ప్రతీ హోంగార్డ్‌లను అభినందించారు. ప్ర జా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అనేక కీలక రంగాల్లో హోంగార్డులు పోలీస్ శాఖకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా హోంగార్డులు తమ సమస్యలపై ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
హోం గార్డుల పిల్లలకు ఆర్థికసాయం..
హోంగార్డు కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు, అలాగే సేవలో ఉండగానే మరణించిన హోంగార్డుల పిల్లలకు దాతల సహకారంతో ఒక్కొక్కరికి రూ.10 వేల సాయం చేశారు. హోం గార్డులకు రెయిన్ కోట్లు, జర్కిన్‌లు పంపిణీ చేశారు. హోంగార్డుల కోసం రూ.3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం ప్రవేశపెట్టారు. గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు హోంగార్డ్ కుటుంబాలకు రూ.38 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ కై ్లమ్ అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


