పొరపాట్లు దొర్లకుండా చూడాలి
భైంసారూరల్/తానూరు/ముధోల్: నామినేషన్లు పకడ్బందీగా పరిశీలించాలని, పొరపాట్లు దొర్లకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు అయేషా మస్రత్ ఖానం అన్నారు. భైంసా రూరల్ మండలం దేగాం పంచాయతీ ఎన్నికల క్లస్టర్ కేంద్రాన్ని, తానూరు మండలం బెల్‌తరోడా నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని, ముధోల్ మండలం తరోడ నామినేషన్ కేంద్రాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులతో మాట్లాడి నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్లను నిశితంగా పరిశీలించాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. అనంతరం తరోడా నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకం వివరాలు ఎంపీడీవో లవకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీవోలు నీరజ్‌కుమార్, శ్రీధర్, ఎంపీవో శివకుమార్, సూపరింటెండెంట్ అశోక్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు


