లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం
నిర్మల్‌టౌన్: తెలిసో తెలియకో తప్పులు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారికి లోక్ అదాలత్ ద్వారా సత్వరం న్యాయం అందుతుందని, రాజీ మార్గంలో పరిష్కారం అవుతుందని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. ఈనెల 21న నిర్మల్‌లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌పై ప్రధాన కోర్టులో శనివారం సమీక్ష నిర్వహించారు. కోర్టు డ్యూటీ అధికారులకు పలు సూచనలు చేశారు. లోక్ అదాలత్ కోసం కేసుల జాబితాలు సిద్ధం చేయాలన్నారు. సంబంధిత పక్షాలతో ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించి, పోలీసు, న్యాయ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి లోక్‌అదాలత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ రాధిక, ఎస్పీ జానకీషర్మిల, పోలీసు అధికారులు, జ్యుడీషియల్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.


