తొలి దశ అధికారుల ర్యాండమైజేషన్
నిర్మల్‌చైన్‌గేట్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల తొలి దశ ర్యాండమైజేషన్ శుక్రవారం పూర్తిచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో చేపట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులకు సరిపడా పీవో, ఓపీవోలను నియమించినట్లు తెలిపారు. అవసరానికన్నా 20 శాతం అదనంగా అధికారులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, అధికారులు పాల్గొన్నారు.
నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగొద్దు
భైంసారూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వీకరిస్తున్న నామినేషన్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండలంలోని మాటేగాం నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ పత్రాలలో వివరాలు సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట సబ్‌కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్, ఎంపీడీవో నీరజ్‌కుమార్, ఎంపీవో ప్రదీప్ తదితరులు ఉన్నారు.


