మెరుగైన వైద్యం అందించాలి
మామడ: వైద్యసిబ్బంది ప్రజలకు అందుబా టులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నా రు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలు, రోజువారీ రో గుల సంఖ్య, అందిస్తున్న సేవలు తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల రక్తనమూనాలను సేకరించి వ్యాధి నిర్దారణ చేయాలన్నారు. పీవోఎం సౌమ్య, వైద్యాధికారి స్వాతి, హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్, సూపర్‌వైజర్ నరేందర్, సిబ్బంది ఉన్నారు.


