కేజీబీవీలకు బంకర్‌బెడ్లు
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్ప నపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యార్థినులు గదుల్లోని చాపలపై నిద్రించాల్సి వ స్తోంది. విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించిన ప్ర భుత్వం బంకర్ బెడ్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ తరహా బెడ్లతో స్థలం వృథా కాకుండా ఉంటుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థి నుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని అవసరమో వి ద్యాలయాల వారీగా లెక్కలు తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు ఆర్డర్లు పొందగా నెలాఖరు వరకు ఆయా కేజీబీవీలకు సరఫరా చేసేందుకు చర్యలు వే గవంతం చేశారు. మొదటి దఫాలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని 45కేజీబీవీలకు 6,860 బంకర్‌బెడ్లు సరఫరా చేయనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ బెడ్లు ఎన్ని అవసరమో ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఆయా కేజీబీవీలకు దశలవారీగా బంకర్ బెడ్లు సరఫరా చేయనున్నారు. మరోవైపు నాబార్డు నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జల ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీ టిసంపులు, బోర్‌వెల్‌లు, ప్రహరీల నిర్మాణం, సో లార్ ఫెన్సింగ్, డార్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్‌ల ఏర్పాటు, భవన మరమ్మతు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతు చేపట్టనున్నారు.
మొదటి దశలో జిల్లాల వారీగా వివరాలు
జిల్లా విద్యాలయాలు పడకలు
ఆదిలాబాద్ 13 2,103
ఆసిఫాబాద్ 12 1,749
నిర్మల్ 10 1,553
మంచిర్యాల 10 1,455
45 6,860


