మామాడలో ఐదుచోట్ల ఏకగ్రీవం
మామడ: మండలంలోని వాస్తాపూర్, కప్పన్‌పల్లి, ఆరేపల్లి, లింగాపూర్, బూరుగుపల్లి పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మండలంలో 27 గ్రామపంచాయతీలుండగా ఐదు చోట్ల ఏకగ్రీవం కాగా, మిగతా 22 చోట్ల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆరేపల్లి సర్పంచ్‌గా జంగిలి రాజవ్వ, బూరుగుపల్లి సర్పంచ్‌గా నాగుల భూమన్న, లింగాపూర్ సర్పంచ్‌గా గుగ్లావత్ గంగారాధ, కప్పన్‌పల్లి సర్పంచ్‌గా సుంచుబాపు లింగన్న, వాస్తాపూర్ సర్పంచ్‌గా ఆడేం భూంబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవులకు 116 నామినేషన్లు రాగా, బుధవారం 34 మంది పోటీ నుంచి తప్పుకోగా 82 మంది బరిలో ఉన్నా రు. వార్డు మెంబర్ స్థానాల కోసం 416 మంది నామినేషన్లు వేయగా 30 మంది ఉపసంహరించుకున్నారు. 386 మంది బరిలో నిలిచారు.
జామ్‌గాం సర్పంచ్‌గా వనిత!
కుభీర్: మండలంలోని జామ్‌గాం గ్రామస్తులంతా బుధవారం సమావేశమయ్యారు. సర్పంచ్‌గా మాన్‌కూర్ వనిత, ఉపసర్పంచ్‌గా మహాగాం రాజేశ్వర్ ను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించారు. గత ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా గ్రామానికి చెందిన ముజాహిత్‌ఖాన్‌ను ఎన్నుకోగా ఆయన ఐదేళ్లు ప నిచేశారు. గ్రామాల్లో గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు.
దస్తురాబాద్‌లో ఒక చోట..
దస్తురాబాద్: మండలంలోని భూత్కూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన సింగరి విజయ, రేగుంట లావణ్య సర్పంచ్‌గా నామినేషన్లు వేశారు. బుధవారం రేగుంట లావణ్య నామినేషన్ ఉపసంహరించుకోవడంతో సింగరి విజయ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన విజయ సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి.
మామాడలో ఐదుచోట్ల ఏకగ్రీవం


