తుదివిడత నామినేషన్ల ప్రక్రియ షురూ..
నిర్మల్ చైన్‌గేట్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తుది దశలో ఐదు మండలాల పరిధిలోని 133 సర్పంచ్ స్థానాలకు గాను తొలిరోజు బుధవారం 121 నామినేషన్లు దాఖలయ్యాయి. 1,126 వార్డు స్థానాలకు 204 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
‘సర్పంచ్’కు దాఖలైన నామినేషన్లు ఇలా..
మండలం సర్పంచ్ దాఖలైన
స్థానాలు నామినేషన్లు
బాసర 10 2
భైంసా 30 31
కుభీర్ 42 42
ముధోల్ 19 11
తానూర్ 32 35
మొత్తం 133 121
‘వార్డు’లకు దాఖలైన నామినేషన్లు ఇలా..
మండలం వార్డు దాఖలైన
స్థానాలు నామినేషన్లు
బాసర 90 0
భైంసా 258 55
కుభీర్ 344 51
ముధోల్ 166 22
తానూర్ 268 76
మొత్తం 1,126 204


