గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
నర్సాపూర్ (జి): గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని సీనియర్ సివిల్ జడ్జి, డిస్టిక్ర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ జి.రాధిక అన్నారు. మండల కేంద్రంలోని శ్రీరామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని సోమవారం ప్రారంభించారు. యువత సద్వినియోగం చేసుకుని విజ్ఞానం పెంచుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆలయ ఆవరణలో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో రామాలయ ట్రస్ట్ అధ్యక్షుడు గోపిడి గంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి దర్శనం సుధాకర్, కోశాధి కారి మంత్రి చంద్రశేఖర్, సలహాసభ్యులు దామోదర్, రాంనాథ్, నారాయణ, గంగారాం, సుదర్శన్‌రెడ్డి, సుభాష్, గంగాధర్, నవీన్ పాల్గొన్నారు.


