గురువుల బోధనకు ప్రత్యామ్నాయం లేదు
నిర్మల్‌ఖిల్లా: గురువులు భవిష్యత్ సమాజ నిర్మాతలని, ఏ కాలంలోనైనా గురువుకు ప్రత్యామ్నాయంలేదని డీఈవో భోజన్న అన్నారు. నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. రిటైర్ అయిన సాంఘికశాస్త్ర స్కూల్ అసిస్టెంట్ మాసూద్, తెలుగు స్కూల్ అసిస్టెంట్ వడ్లూరి సుదర్శన్, జూనియర్ అసిస్టెంట్ ప్రహ్లాద్‌ను డీఈవో కార్యాలయంలోవారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ సంఘం నేతలు, విద్యా శాఖ సిబ్బంది సమక్షంలో సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ పర్యవేక్షకులు, విద్యాశాఖ సమన్వయకర్తలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.


