నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
సారంగపూర్: మండలంలోని చించోలి(బి), ధని, జామ్ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సోమవారం పరిశీలించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను, జారీ చేసిన నామినేషన్ పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించారు. అభ్యర్థుల సమస్యలు నివృత్తి చేయడంతోపాటు వా రికి అవసరమైన వివరాలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. అక్కడి నుంచి సారంగాపూర్ రైతుకేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ వివరాల ఆన్‌లైన్ కౌంటర్‌ను పరిశీలించారు. నమోదు చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపీవో అజీజ్‌ఖాన్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


