మద్యం షాపుల కేటాయింపునకు లక్కీడ్రా
నిర్మల్‌టౌన్: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని 47 మద్యం షాపులను కేటాయించారు. మొత్తం 991 దరఖాస్తులు అందిన నేపథ్యంలో ఒక్కో దుకాణానికి సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా డ్రా తీశారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపి పూర్తి పారదర్శకతతో ప్రక్రియ పూర్తి చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా డ్రా కొనసాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. లక్కీ డ్రాలో ఎంపికై న వారికి నిర్ణీత లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేదికపైనే కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి అబ్దుల్ రజాక్, ఎకై ్సజ్ సిబ్బంది, మద్యం దుకాణాల దరఖాస్తుదారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


