హెల్మెట్‌తో ప్రాణాలు భద్రం
నిర్మల్‌టౌన్: ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు రక్షించుకోవచ్చని రవాణావాఖ అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు. జిల్లాలో 85 శాతం మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదంలో 60 నుంచి 70 శాతం వరకు హెల్మెట్ లేకనే మృతి చెందినట్లు అంచనా.
నామ మాత్రపు తనిఖీలు
పోలీసులు, రవాణా శాఖ హెల్మెట్ ధరించని వారిపై చర్యలు అంతగా తీసుకోవడం లేదని, తనిఖీలు కూడా నామమాత్రంగా చేపడుతున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా పోలీసులు, రవాణా అధికారులు తమ బాధ్యతగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
నాణ్యమైన వి ఉపయోగించాలి
నాసిరకం హెల్మెట్ ప్రమాద తీవ్రతను ఏమాత్రం తగ్గించలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ స్ట్రాప్ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలకు ధరించినప్పుడు స్ట్రాప్ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. ప్రధానంగా డిపార్టుమెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఐఎస్‌ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లు ధరించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రాణాపాయం నుంచి 98 శాతం బయటపడొచ్చు. దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది.
వాడకంపై చట్టం..
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే వాహనదారుడు హెల్మెట్ లేకుండా జరిమానా కడుతుంటే డ్రైవింగ్ లెసెన్స్ శాశ్వతంగా రద్దుచేసే అవకాశం ఉంటుంది.
ఇటీవల జరిగిన ఘటనలు


