ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
నిర్మల్‌టౌన్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


