జిల్లాస్థాయి జట్లకు ప్రత్యేక శిక్షణ
దిలావర్‌పూర్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై న జట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బాలబాలికలకు వేర్వేరుగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు. బాలుర జట్లకు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, బాలికల జట్టుకు ఆసిఫాబాద్‌లోని క్రీడా పాఠశాలలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6 నుంచి 8 వరకు పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.


