యూడైస్‌లో వివరాలు నమోదు చేయాలి
నిర్మల్‌రూరల్: పాఠశాలల వివరాలను యూడైస్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యూడైస్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మూడు రకాల మాడ్యూల్స్‌లలో పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 8 పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు రాజేశ్వర్, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


