● లేఖ విడుదల చేసిన మార్క్‌ఫెడ్
కొనుగోళ్లకు పర్మిషన్ రావాలి
భైంసా: జిల్లాలో సోయా రైతుల తిప్పలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు సోమవారం లేఖ విడుదల చేశారు. ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆదేశాలు అందిన వెంటనే మార్క్‌ఫెడ్ ద్వారా సోయా కొనుగోళ్లు ప్రారంభిస్తామని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా అదనపు కలెక్టర్ కూడా మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు.


