బల్దియాలకు మహర్దశ..
న్యూస్‌రీల్
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు నిధులు మంజూరు వరద కాలువలు, సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలకు ప్రాధాన్యం పార్కులు, సుందరీకరణ పనులకు మోక్షం
నిర్మల్
మనమూ చేద్దాం... మారథాన్
ఉరుకులు, పరుగుల జీవితంలో రోజూ క్రమం తప్పకుండా నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఓటరు జాబితా పరిశీలన వేగవంతం చేయాలి
భైంసాటౌన్: ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం బీఎల్‌ఓలతో మాట్లాడారు. ఓటరు జాబితాపై ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బీఎల్‌వోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాల పరిశీలన పక్కాగా చేయాలని సూచించారు.
భైంసాటౌన్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొంతకాలంగా మున్సిపాలిటీలకు నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నచందంగా ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పనులు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు అధ్వానంగా మారాయి. మరోవైపు భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వరద నీరు పారేలా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు, వర్షపునీరు రహదారులపై నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోనూ మురుగు నీరు ఇళ్లలోకి చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులకు మోక్షం కలుగనుంది. ముఖ్యంగా డ్రెయినేజీలు, సీసీరోడ్లు, వరద కాలువలతో పాటు పార్కులు, సుందరీకరణ పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు.
పట్టణాభివృద్ధికి తోడ్పాటు..
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 కోట్లతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు గుర్తించాం. ఈ నిధులతో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, వరద కాలువల నిర్మాణం చేపడతాం. పార్కులు, జంక్షన్లను ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తాం.
– బి.రాజేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, భైంసా
బల్దియాలకు మహర్దశ..


