
ఘనంగా వెలుగుల పండుగ
లక్ష్మీ పూజలో ఎమ్యెల్యే రామారావు పటేల్,
దీపావళి వేడుకల్లో కుటుంబం
యూరప్‌లో లక్ష్మీపూజలో తెలంగాణవాసులు
జిల్లా వ్యాప్తంగా వెలుగుల పండుగ దీపావళిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. లక్ష్మీ పూజలు చేశారు. భైంసా పట్టణంలో వ్యాపారులు ఖాతా బుక్కులకు పూజలు చేశారు. పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్‌లో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నివాసంతోపాటు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.నారాయణ్‌రావు పటేల్, బీజేపీ నాయకుడు బి.మోహన్‌రావు పటేల్ నివాసాల్లో లక్ష్మీ పూజలు చేశారు. సాయంత్రం ముంగిళ్లలో దీపాలు వెలిగించారు. చిన్న, పెద్ద అందరూ కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కడెం మండలం లింగాపూర్‌కు చెందిన మనోజ్, ఇతర జిల్లాలకు చెందిన తెలంగాణ వాసులు యూరప్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నార్త్‌మెసిడోనియాలో ధనలక్ష్మీ పూజలు నిర్వహించారు. – నిర్మల్ టౌన్/భైంసాటౌన్/కడెం

ఘనంగా వెలుగుల పండుగ

ఘనంగా వెలుగుల పండుగ

ఘనంగా వెలుగుల పండుగ