
కోట ముందా.. పట్టా ముందా..!
చుట్టూ ఎత్తయిన రాతికట్టడంతో, లోపల విశాలమైన స్థలంతో అద్భుతంగా నిర్మించిన ఈ కోట.. శ్యాంగఢ్. నిర్మల్ జిల్లా కేంద్రానికి స్వాగతం పలుకుతున్నట్లుగా, ఘనమైన గతచరిత్రకు రాచరికపు ఆనవాలు అన్నట్లుగా ఉంటుంది. ఇది ఎప్పుడో 450 ఏళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్లక్రితం అప్పటి కలెక్టర్ దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామనుకున్నారు. తీరా.. ఈ కోటలోపల భూమికీ పట్టా ఉన్నట్లు తేలడంతో విస్మయం వ్యక్తంచేశారు. ఈ కోట లోపలే కాదు.. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న పోరంబోకు భూములకూ ఎసరు పెడుతున్నారు. నిర్మల్–హైదరాబాద్ రోడ్డుకు పక్కనే ఉండటం, రెవెన్యూ వ్యవస్థలు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇక్కడి సర్కారు జాగాలకు పట్టాలు పుట్టుకొస్తున్నాయి.