
సబ్ స్టేషన్‌ను సందర్శించిన ఆర్జీయూకేటీ విద్యార్థులు
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు క్యాంపస్ ఆవరణలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం సందర్శించారు. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్ మార్గదర్శకత్వంలో అసోసియేట్ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ కె.మహేశ్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం పర్యవేక్షణలో ఈ క్షేత్రపర్యటన చేశారు. విద్యుత్ వ్యవస్థలు, సబ్‌స్టేషన్ కార్యకలాపాల పై విద్యార్థులు అవగాహన పెంచుకునేలా ఈ కార్యక్రమం చేపట్టారు. 180 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న భావనలను క్షేత్రపర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ భూక్య భావ్‌సింగ్, అధ్యాపకులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.