
ప్రజాక్షేత్రంలో ఉన్నవారికే పదవులు
భైంసాటౌన్: నిత్యం ప్రజల్లో ఉంటూ, పార్టీ కోసం పనిచేసేవారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ జిల్లా పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్యే అజ య్‌సింగ్ అన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌తోనే సాధ్యమయ్యాయన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ప్రస్తావిస్తూ.. ప్రజలకు సేవ చేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని, పార్టీ పదవులు కట్టబెడుతుందన్నారు.
మచ్చ లేనివారినే ఎన్నుకోండి...
ఎలాంటి అవినీతి మచ్చ లేనివారినే డీసీసీ నూతన అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.నారాయణ్‌రావు పటేల్ అజయ్‌సింగ్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు రాజకీయాన్ని దందాగా మార్చుకుంటున్నారని వేదికపై ఉన్న మాజీ ప్రజాప్రతినిధిని ఉద్దేశించి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎవరైనా అవినీతికి పాల్పడి తే జైలు పాలవుతారంటూ హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకో వాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కోఆర్డినేటర్ జితేందర్, టీపీసీసీ పరిశీలకులు రాంభూపాల్, ధనపతి, వేణుగోపాలచారి, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.