
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రాల్లో సరిపడా గన్నీ సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టా ర్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం త రలింపునకు సరిపడా లారీలు సమకూర్చుకోవా లని, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి ముగించాలని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా ట్లాడుతూ.. కలెక్టర్లు స్వయంగా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ, ప్రక్రియ సరిగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల ని తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. త్వరలోనే కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారి రాజేందర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.