
ఇంటర్‌కూ ప్రత్యేకం
న్యూస్‌రీల్
నిర్మల్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కుంటాల: నిర్మల్ జేఎన్‌ఆర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ పోటీల్లో కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు గనుశ్రీ, స్వప్న, దివ్య, నాగజ్యోతి, విద్య, విశాల్, జెస్వంత్, కార్తికేయ ప్రతిభ కనబరిచారు. వీరు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ నాటికను ఉపాధ్యాయులు గంగాప్రసాద్, ఉమేశ్‌రావు, నవీన్‌కుమార్, దత్తు ప్రోత్సాహంతో ప్రదర్శించారు. జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని బుధవారం జిల్లా విద్యాధాకారి భోజన్న, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
కబడ్డీ పోటీలకు..
లక్ష్మణచాంద: రాష్ట్రస్థాయి అండర్–14 కబడ్డీ పోటీలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి కే సంజీవ్ ఎంపికై నట్లు పీడీ శ్రీనివాస్ తెలిపా రు. ఇటీవల నిర్వహించిన మండల, జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. సంజీవ్ ఈ నెల 16నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. సంజీవ్‌కు ప్రధానోపాధ్యాయుడు రాజునాయక్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవలే నిధులు కేటాయించి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోంది. అధ్యాపకులు, వి ద్యార్థుల హాజరులో మరింత పారదర్శకతకు ఫేషి యల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్ర స్తుతం వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలి తాలు సాధించేందుకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టి ప్రారంభించింది.
ఇప్పటికే తరగతులు షురూ..
జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రత్యేక తరగతులు ప్రారంభించినట్లు జిల్లా నోడల్ అధికారి పరశురాంనాయక్ తెలిపారు. సాయంత్రం 3.30 నుంచి 5వరకు రోజుకు గంటన్నరపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. విద్యార్థుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తున్నారు.
ఉత్తమ ఫలితాలు సాధిస్తాం
ప్రత్యేక తరగతుల సమయంలో మా సందేహాల ను అధ్యాపకులు వెంటనే నివృత్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు వెళ్లి ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.
– హరిత, ఇంటర్ మొదటి సంవత్సరం
బోర్డు సూచనల మేరకే..
ఇంటర్ బోర్డు అధికారుల సూచనల మేరకే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే వారిని సన్నద్ధం చేస్తున్నాం.
– పరశురాంనాయక్, జిల్లా నోడల్ అధికారి
ప్రయోజనం ఉంది
ఇంటర్ బోర్డు అమలు చేస్తున్న ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా ఉన్నా యి. నేను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాను. ఇంటి వద్ద చదువుకునే పాఠ్యాంశాలను కాలేజీలోనే చదువుకుంటున్నాం. సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాం.
– మౌనిక, ఇంటర్ ద్వితీయ సంవత్సరం
జిల్లా సమాచారం
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 13
ఫస్టియర్ విద్యార్థుల సంఖ్య 2,592
సెకండియర్ విద్యార్థుల సంఖ్య 2,252
మొత్తం విద్యార్థుల సంఖ్య 4,844
ఫిబ్రవరి చివరలో పరీక్షలు
ఈసారి మార్చి రెండో వారంలో కాకుండా ఫిబ్రవరి చివరలోనే వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించినట్లు తెలిసింది. ఒక వేళ సీఎం బోర్డు ప్రతిపాదనలు ఆమోదిస్తే ఫిబ్రవరి చివరలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని అధ్యాపకులు కోరుతున్నారు.
గత ఫలితాలు ఇలా..
2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,332 విద్యార్థులకు 3,149 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 73.13 శాతం, సెకండియర్‌లో 71.71 శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లాను 11వ స్థానంలో నిలిపారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్‌కూ ప్రత్యేకం

ఇంటర్‌కూ ప్రత్యేకం

ఇంటర్‌కూ ప్రత్యేకం

ఇంటర్‌కూ ప్రత్యేకం

ఇంటర్‌కూ ప్రత్యేకం