
బీమాతో కుటుంబానికి ధీమా
భైంసారూరల్: బ్యాంక్ రుణాలు తీసుకున్నవారంతా కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాల్లో చేరాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్‌ఎం నవీన్‌కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని ఇలేగాంలో బాధిత కుటుంబానికి ప్రమాదబీమా చెక్కు అందించే కార్యక్రమానికి హాజరైన ఆయన బీమా పథకాలపై అవగాహన కల్పించారు. పీఎంజేవై, ఏంఎస్‌వై పథకాల్లో ఏడాదికి రూ.20నుంచి రూ.450 ప్రీమియంతో చేరినవారికి ప్రమాద మరణాలు సంభవించినప్పుడు బాధిత కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో రూ.500 నుంచి రూ.2వేల వరకు ప్రీమియం చెల్లించిన వారికి రూ.10లక్షల నుంచి రూ.40లక్షల వరకు బాధిత కుటుంబానికి బీమా సొమ్ము అందుతుందని తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన నీలం సాయినాథ్ కుటుంబానికి రూ.10లక్షల చెక్కు అందించారు. ఎస్‌ఎంవో అభినయ్, ఎస్‌ఎంబీ విలాస్, దేగాం బ్యాంక్ మేనేజర్ కే సోని, ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.