
డిపాజిట్ పెంచినా అదే పోటీ
జిల్లాలో అత్యధిక ఆదాయమున్న
గతంలో ఒక్కోదానికి 30కి పైగా..
ఈసారి భారీగా పెరిగే అవకాశం
23న డ్రా పద్ధతిలో కేటాయింపు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా ఈసారి వ్యాపారులు అధికసంఖ్యలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–2027 సంవత్సరానికి మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రూ.3లక్షల చలాన్‌తో సెప్టెంబర్ 26 నుంచి ఎకై ్సజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 47 మద్యం షాపులున్నాయి. అయితే, గతంలో పలు వైన్‌షాపులకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రస్తుతం కూడా వాటికే అధిక డిమాండ్ ఉంటుందని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల కాలపరిమితిలో రూ.కోట్లలో వ్యాపారం జరగడంతో వ్యాపారులు అధిక ఆదాయం వచ్చే మద్యం షాపులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అధిక ఆదాయ మున్న షాపులు దక్కించుకునేందు కు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చే సుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అత్యధిక దరఖాస్తులు ఇక్కడే..
జిల్లాలో దాదాపు 20 వైన్‌షాపులకు 2023–2024లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. శాంతినగర్‌లో గల మద్యం షాపునకు 76 దరఖాస్తులు రాగా, సెప్టెంబర్ వరకు లిక్కర్ విక్రయం ద్వారా రూ.19.31 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి మరో వైన్‌షాప్‌నకు అదే ఏ రియాలో అవకాశం కల్పించారు. కా గా, గతంలో మాదిరిగా ఈ వైన్‌షా ప్‌నకు దరఖాస్తులు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 18వరకు గడువు
మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18న సాయంత్రం 5గంటల వరకు అవకాశముంది. గతంలో చివరి దశలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఈసారీ అదే మాదిరిగా దరఖాస్తులు అత్యధిక సంఖ్యలో వస్తాయని భావించిన ఎకై ్సజ్ అధికారులు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ప్రధాన ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం వరకు 47 దుకాణాలకు 65 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 42 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
వైన్‌షాప్‌లకు దరఖాస్తుల వెల్లువ
గతంలో అధిక దరఖాస్తులు, ఆదాయం వచ్చిన షాపులు
గెజిట్ దరఖాస్తులు మొదటి ఏడాది ఈ ఏడాది సెప్టెంబర్
నెంబర్ ఆదాయం 25వరకు ఆదాయం
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
2 38 12.85 11.49
3 24 15.75 13.33
5 37 10.37 6.88
6 33 10.30 7.42
7 21 11.08 8.49
8 20 10.22 6.98
10 74 18.22 14.70
19 45 12.37 13.49
20 33 15.63 13.41
22 16 10.46 11.45
23 28 10.53 9.62
27 21 7.10 11.75
28 20 10.84 9.79
37 15 10.18 8.91
45 12 13.00 9.92
47 31 10.61 10.08
ఒక్కరోజే 42 దరఖాస్తులు
నిర్మల్ టౌన్: జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం ఒక్కరోజే 42 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 18న సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించి 23న లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మల్, భైంసా ఎకై ్సజ్ సీఐలు రంగస్వామి, నజీర్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.