
హక్కుల కోసం రాజీలేని పోరు
భైంసారూరల్: ఉద్యోగుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్‌రావు తెలిపా రు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రా మంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఉద్యమించక తప్పదని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. 2012 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేయాలని, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతకు సబ్ కమిటీ వేసి పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ అథారిటీ కమిటీలో ఉపాధ్యాయుల స్థానంలో విద్యావలంటీర్లను నియమించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వా రికి వెంటనే పింఛన్ మంజూరు చేసి పత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయకుడు ధర్మాజీ చందనే, జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, గంగన్న, రామునాయక్, మారుతి, సునీల్ తదితరులున్నారు.