
ఓరియంట్ కార్మికులకు బోనస్ పెంపు
కాసిపేట: దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీ పర్మినెంట్, లోడింగ్ కార్మికులకు బోనస్ పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్‌రావుతో యాజమాన్యం గురువారం నిర్వహించిన చర్చల్లో రూ.4 వేలు పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతంలో రూ.35,500 ఉండగా ప్రస్తుతం రూ.39,500కు పెంచారు. రాబోయే సంవత్సరానికి రూ.2వేలు పెంచుతూ రూ 41,500లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.16,800 ఇస్తుండగా రూ.వెయ్యి పెంచుతూ రూ.17,800 ఇవ్వనున్నట్లు తెలిపారు. చర్చల్లో కంపనీ హెచ్‌ఆర్ హెడ్ ఆనంద్ కులకర్ణి, గుర్తింపు సంఘం సెక్రటరీ భీమిని మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు పాల్గొన్నారు.
అగ్రిమెంట్ పత్రాలతో సత్యపాల్‌రావు