
ముంబై ఎయిర్‌పోర్టులో ఆదిలాబాద్ వాసి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: టాంజానియా దేశంలో ఉంటూ మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. గురువారం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌రూరల్ పోలీసులు రౌడీషీటర్ కై ంచి సలీంను అరెస్ట్ చేసిన ఘటనపై నిందితుడు ఇర్ఫాన్ ‘సిల్‌సిలా ఆదిలాబాద్’ అనే వాట్సాప్ గ్రూపులో టాంజానియాలో ఉంటూ వివాదాస్పద వాయిస్, టెక్స్ ్ట మెసేజ్‌లు పోస్ట్ చేశాడు. దీంతో గత ఏప్రిల్ 15న ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాల్లో ఉండటంతో ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు ఇమిగ్రేషన్ అధికారులు అతనిపై లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్‌ఓసీ) జారీ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం టాంజానియా నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన షేక్ ఇర్ఫాన్‌ను ఇమిగ్రేషన్ అధికారులు డిటైన్ చేసి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై పీర్‌సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ముంబైలో అతన్ని పట్టుకొని ఆదిలాబాద్‌కు తరలించినట్లు చెప్పారు. జడ్జి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. నిందితుడి వద్ద నుంచి పాస్‌పోర్ట్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ముంబై ఎయిర్‌పోర్టులో ఆదిలాబాద్ వాసి అరెస్ట్