
స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
తానూరు: వ్యాపార అవసరాల కోసం సీ్త్రనిధి రుణాలు పొందిన మహిళలు ఆర్థికాభివృద్ధి సా ధించాలని అదనపు డీఆర్డీవో చరణ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవనంలో నిర్వహించిన మండల సమాఖ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి తి రిగి మళ్లీ పొంది వ్యాపారాలు వృద్ధి చేసుకోవా లని సూచించారు. మరిన్ని కొత్త గ్రూపులు ఏ ర్పాటు చేసి వారికి రుణాలు అందించేలా చూ డాలని అధికారులకు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల సంఘాలను సత్వరమే ఏర్పాటు చేసే లా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం మారుతి, ఐకేపీ ఏపీఎం సులోచనరెడ్డి, సీసీలు భోజన్న, సవిత, సరస్వతి, పోశెట్టి, దత్తు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.