
చిన్నారులకు ఇంటి పంట
న్యూస్‌రీల్
అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ షెడ్లు ఆకు కూరలు, కూరగాయల సాగు జిల్లాలో తొమ్మిది కేంద్రాల ఎంపిక రూ.10 వేల చొప్పున కేటాయింపు ఇప్పటికే చేరిన విత్తనాల ప్యాకెట్లు
నిర్మల్
గోదారమ్మకు హారతి
బాసర: బాసర సరస్వతీ ఆలయ అర్చక వైదిక బృందం బుధవారం గోదారమ్మకు హారతి నిర్వహించింది. ఉధృతి ఎక్కువగా ఉండగా శాంతించు తల్లీ.. అని భక్తులు వేడుకున్నారు.
కొనసాగుతున్న రథోత్సవం
లక్ష్మణచాంద: మండలకేంద్రంలో వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడోరోజైన బుధవారం శ్రీ అష్ట భుజ వేణుగోపాలస్వామి ప్రతిమను గజ వా హనంపై ఊరేగించారు. మహిళలు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవా లు వచ్చే నెల 2వరకు కొనసాగనున్నాయి.
మామడ: మండలంలోని పొన్కల్ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం హనుమంతుడి వాహనంలో వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను వీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు, భజనపరులు దర్శించుకుని పూజలు చేశారు.
నిర్మల్‌చైన్‌గేట్: చిన్నారులు, గర్భిణులకు పోషకా హారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేంద్రాల్లో అందించే ఆహా రంలో వినియోగించే ఆకు కూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఇక్కడే పండించిన తాజా కూరగా యలతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందనుంది.
ఒక్కో సెంటర్‌కు రూ.10వేలు..
జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు ఒక్కో దానికి రూ.10వేల చొప్పున నిధులు కేటాయించగా ఆవరణల్లో తోటలు, కుండీల్లో కూరగాయలు, ఆకు కూరలు పెంచనున్నారు. బయటి మార్కెట్లపై ఆధారపడకుండా, రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ కూరగాయలు పండించడం ద్వారా ఆహార నాణ్యత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహార లోపం తీవ్ర సమస్యగా మారింది. ఆయా సెంటర్ల ఆవరణల్లో వంకాయ, బెండ, టమాటా, గోంగూర, తోటకూర, పాలకూర వంటివి సాగు చేయనుండగా.. వీటి ద్వారా పిల్లలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అందనున్నాయి. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడనున్నాయి.
సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు
ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి విత్తనాల ప్యాకెట్లను నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బులు సంవత్సరానికి రూ.500 చొప్పున చెల్లిస్తారు. సంవత్సరానికి రూ.వెయ్యి నిర్వహణ ఖర్చుల కోసం అందజేస్తారు. అయితే ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లు నిర్వహించాల్సి ఉంటుంది. కేటాయించిన రూ.10వేలలో నారు పెట్టేందుకు రూ.3వేలు, రవాణా ఖర్చులకు రూ.వెయ్యి, విత్తనాలు నాటేందుకు, దుక్కి సిద్ధం చేసే ఖర్చుల కోసం రూ.వెయ్యి, పంట నిర్వహణ, నీటి వసతుల కల్పన కోసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన రూ.10వేలతోనే ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది.
పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లాలో ఎంపికై న కేంద్రాలు
మండలం గ్రామం కేంద్రం
మామడ పరిమండల్ పరిమండల్–2
మామడ కొరిటికల్ కొరటికల్–1
మామడ కొరిటికల్ కొరటికల్–2
మామడ పొన్కల్ పొన్కల్–2
భైంసా ఈలేగామ ఈలేగామ–1
భైంసా తిమ్మాపూర్ తిమ్మాపూర్–1
భైంసా ఎగ్గమ్ ఎగ్గమ్
భైంసా సిద్దూర్ సిద్దూర్
కుభీర్ కుభీర్ కుభీర్–2
నిధుల వినియోగంపై శిక్షణ
ఒక్కో అంగన్‌వాడీ సెంటర్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10వేల నిధులు ఎలా వినియోగించాలి.. ఏ మొక్కలు నాటాలి.. తోటలను ఎలా నిర్వహించాలి? అనే విషయాలపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నిధులను విత్తనాలు, కుండీలు, మట్టి, ఇతర పనిముట్ల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పటిష్ట పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
చిన్నారులకూ అవగాహన
కూరగాయలు, ఆకు కూరల తోటల పెంపకంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలది కీలకపాత్ర. తోటల నిర్వహణలో పిల్లలను కూడా భాగస్వాములను చేయడం ద్వారా వారికి వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పించే అవకాశముంటుంది. కూరగాయలు ఎలా పండుతాయి.. వాటిని ఎలా సంరక్షించాలి? అనే విషయాలు నేరుగా అనుభవం ద్వారా తెలుస్తాయి. ఇది ఒక రకంగా ప్రయోగాత్మక విద్యగా కూడా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

చిన్నారులకు ఇంటి పంట

చిన్నారులకు ఇంటి పంట