తనిఖీలతో వ్యాపారుల బెంబేలు | - | Sakshi
Sakshi News home page

తనిఖీలతో వ్యాపారుల బెంబేలు

Sep 25 2025 7:05 AM | Updated on Sep 25 2025 7:05 AM

తనిఖీలతో వ్యాపారుల బెంబేలు

తనిఖీలతో వ్యాపారుల బెంబేలు

● రెండోరోజు కొనసాగిన వాణిజ్య ● బంగారు, వెండి వర్తకుల్లో గుబులు

పన్నులశాఖ అధికారుల పరిశీలన

భైంసాటౌన్‌: పట్టణంలో బంగారు, వెండి వర్తకులు గుబులు చెందుతున్నారు. వాణిజ్య పన్నులశాఖ అ ధికారుల తనిఖీలతో బెంబేలెత్తుతున్నారు. మంగళవారం ఏసీటీవో ఆధ్వర్యంలో తనిఖీలకు రాగా, దా దాపు బంగారు, వెండి వరక్త దుకాణాదారులంతా భయంతో షాపులు మూసి ఉంచారు. అనంతరం దుకాణాదారులతో కలిసి అసోసియేషన్‌ హాల్‌లో స మావేశమైన అధికారులు అవగాహన కల్పించేందు కు వచ్చామని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, బుధవారం కూడా సీటీవో (కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌) గోదావరి ఆధ్వర్యంలో తనిఖీలకు రావడంతో విషయం తెలుసుకున్న దుకాణాదారులు రోజంతా షాపులు మూసి ఉంచారు.

ముందుగా రెండు బృందాలు

పట్టణంలోని బంగారు, వెండి వర్తక దుకాణాల్లో వా ణిజ్య పన్నులశాఖ అధికారులు తనిఖీలకు వచ్చి నట్లు తెలిసింది. స్థానిక కూరగాయల సంత సమీ పంలోని ఓ బంగారు, వెండి వర్తక దుకాణంలో సీటీవో గోదావరి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దా దాపు మూడున్నర గంటలకుపైగా అమ్మకాలు, కొ నుగోళ్లు, పన్ను చెల్లింపులు తదితర రికార్డులు పరి శీలించినట్లు సమాచారం. అలాగే, మున్సిపల్‌ కా ర్యాలయం ఎదురుగా గల మహాలక్ష్మి కాంప్లెక్స్‌లో ని ఓ దుకాణంలో మరో బృందానికి చెందిన అధికా రులు తనిఖీలు చేపట్టారు. అయితే, అధికారులు మాత్రం జాయింట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తనిఖీలు పూర్తి కాలేదని, మరోసారి పూర్తి రికార్డులు పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామంటున్నారు.

వ్యాపారుల్లో హడల్‌

రెండురోజులుగా భైంసాలో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీలతో స్థానిక బంగా రు, వెండి వర్తకులు బెంబేలెత్తుతున్నారు. సదరు అధికారులు వ్యాపారుల జీఎస్టీ లైసె న్స్‌లు, ఐటీ రిటర్న్‌లు, క్రయవిక్రయాల రశీ దులు తదితర వివరాలు అడుగుతుండడంతో మిగతా దుకాణాదారులు ఎందుకొచ్చిన గొ డవ అనుకుని షాపులు మూసి ఉంచుతున్నా రు. మరుసటిరోజు కూడా అధికారులు తని ఖీలకు వస్తారని జంకుతున్నారు. ఈ విషయ మై సీటీవో గోదావరిని వివరణ కోరగా, శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వారు పేర్కొన్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఏసీటీవోలు విజయలక్ష్మి, సంతోష్‌తో కలిసి ఓ బంగారు, వెండి వరక్త దు కాణంలో క్రయవిక్రయాల లావాదేవీలు, ఐటీ రిటర్న్‌లు, బ్యాంక్‌ ఖాతాలు, ఇతర వివరాలు తనిఖీ చేశామని తెలిపారు. అయితే, సదరు దుకాణాదారుకు జరిమానా విధించినట్లు తెలిసిందని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని చెప్పారు. తనిఖీలు పూర్తి కాలేదని, మరోసా రి తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement