
ఎస్‌ఐఆర్ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి
నిర్మల్‌టౌన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002పై కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్ల తొలగింపుకు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో చివరగా 2002 లో ఎస్‌ఐఆర్ చేయడం జరిగిందన్నారు. ఎస్‌ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లతో బూత్‌స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధి కారి, ఏఈఆర్‌ఓ, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్‌వో, పర్యవేక్షకులు తగినంత మంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ.. ఎస్‌ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ నిర్వహణకు ముందుగానే ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్‌ఐఆర్ వివరాలను 2025 ఎస్‌ఎస్‌ఆర్ డేటాతో సరిపోల్చాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి పాల్గొన్నారు.