
పత్రికా స్వేచ్ఛపై దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని న్యాయవాదులు, ఉద్యమ సంఘాల నాయకులు తెలిపారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగడం, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టుల గొంతును నొక్కేసేలా వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
బెల్లంపల్లి: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం పత్రిక రంగం. పత్రికల్లో నిరాధారణమైన, అసత్యమైన వార్తా కథనాలు వస్తే వివరణ కోరవచ్చు. సదరు పత్రిక బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలు, అణచివేత విధానాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదు. ఏదైనా సరే చట్టానికి లోబడి వ్యవహరించాలి. కానీ వేధింపులకు గురి చేసే ధోరణి ఏమాత్రం మంచిది కాదు. పత్రికా స్వేచ్ఛను కాలరాయలనుకోవడం అవివేకం అవుతుంది.
– అంకెం శివకుమార్,
బెల్లంపల్లి బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు
పత్రికా స్వేచ్ఛను కాలరాయొద్దు

పత్రికా స్వేచ్ఛపై దాడి