
యూరియా కష్టాలు
నిర్మల్ రూరల్/లోకేశ్వరం: జిల్లా రైతులకు యూరియా కష్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ జరిగింది. ప్రస్తుతం కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామానికి 15 రోజుల తర్వాత యూరియా వచ్చిందని తెలియడంతో పంపిణీ కేంద్రం వద్ద చిట్యాలతోపాటు సిర్గాపూర్, లోలం, కాలువ తాండ, చించోలి(బి) రైతులు ఉదయమే బారులు తీరారు. చాలాసేపు క్యూలో నిల్చోవడంతో విసిగిపోయిన కొందరు రైతులు చెప్పులు, గుర్తింపు కార్డులను వరుసలో ఉంచి, సమీపంలోని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నారు. కేవలం 450 బస్తాలు మాత్రమే రావడంతో అందరికీ అందలేదు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రూరల్ ఎస్సై లింబాద్రి జోక్యం చేసుకుని రైతులను సముదాయించారు. ఒక్కో పాస్ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేయించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కూడా రైతులు తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో నిల్చున్నారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి టోకెన్ల కోసం ఇబ్బంది పడ్డారు. పీఏసీఎస్ సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 450 బస్తాలు మాత్రమే వచ్చాయని, రైతుకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు. శనివారం మరో 450 బస్తాల కోసం వ్యవసాయ అధికారి గిరిరాజ్ టోకెన్ల పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి వర్షంలో తడుస్తూ నిరీక్షించారు.
లోకేశ్వరం రైతువేదిక వద్ద యూరియా కోసం బారులుతీరిన రైతులు..

యూరియా కష్టాలు

యూరియా కష్టాలు

యూరియా కష్టాలు

యూరియా కష్టాలు