
ఉత్సాహంగా ‘కళా ఉత్సవ్’
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పో టీలు నిర్వహించారు. వరంగల్ ఆర్జేడీ సత్యనారా యణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను చదువుతోపాటు కళల్లోనూ ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని పేర్కొన్నారు. కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించా రు. అనంతరం పలు విభాగాలలో విద్యార్థులకు పో టీలను నిర్వహించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు ఆర్జేడీ, డీఈవో భోజన్న ప్రదా నం చేశారు. ఏఎంవో నరసయ్య, జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, సాంస్కృతిక కళాసారథి నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజేతల వీరే..
వోకల్ మ్యూజిక్ సోలో విజేత: పి.మహేంద్ర, వాసవి హైస్కూల్ భైంసా. గ్రూప్ విజేత అక్షిత గ్రూప్, కేజీబీవీ జామ్. ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ విజేత పి.అనుదీప్తి గ్రూప్, సోఫీ నగర్ గురుకుల పాఠశాల, విజువల్ ఆర్ట్స్ 2డీ విజేత పి.అభిజ్ఞ, కేజీబీవీ జామ్, విజువల్ ఆర్ట్స్ 3డీ విజేత హవిషశ్రీ, శ్రీ చైతన్య హైస్కూల్, నిర్మల్, విజువల్ ఆర్ట్స్ గ్రూప్ విజేత జి.వినోద్, సీహెచ్.విగ్నేష్, జెడ్పీహెచ్‌ఎస్ మంజులాపూర్, డాన్స్ సోలో క్లాసికల్ విజేత కీర్తిశ్రీ, అల్ఫోర్స్ హైస్కూల్ నిర్మల్, గ్రూప్ డాన్స్ విజేత నిహారిక గ్రూప్, జెడ్పీహెచ్‌ఎస్ మంజులాపూర్, ఇన్స్‌ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్, డి.అంకిత గ్రూప్ శ్రీసరస్వతి శిశు మందిర్, భైంసా. ఇన్స్‌్‌ట్రుమెంటల్ మ్యూజిక్ సోలో విజేత అభిలాష్, నారాయణ హైస్కూల్ నిర్మల్, థియేటర్ ఆర్ట్ గ్రూప్ విజేత జి.సుప్రియ గ్రూప్, కేజీబీవీ జామ్, ఇన్స్‌్‌ట్రుమెంటల్ మ్యూజిక్(రిథమ్) విజేత పి.రాము జెడ్పీహెచ్‌ఎస్ గుండంపల్లి.

ఉత్సాహంగా ‘కళా ఉత్సవ్’