
ఈ ఫొటోలు చూసి ఇదేదో పాడుబడ్డ బంగ్లా అనుకునేరు. ఇది కడెం తహసీల్దార్ కార్యాలయం. ఆ మండలం మొత్తానికి పెద్దదిక్కు. కానీ.. ఎప్పుడు కూలుతుందో తెలియని దయనీయస్థితిలో ఉంది. ఇంకో విషయం ఏమంటే.. ఇదసలు తహసీల్ ఆఫీస్ కాదు. పాత తహసీల్దార్ భవనం శిథిలావస్థకు చేరడంతో 15 ఏళ్ల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఈ పాత బిల్డింగ్‌లోకి కార్యాలయాన్ని మార్చారు. ఈ భవనం ఇబ్బందికరంగా ఉందనే పీహెచ్‌సీకి కొత్త భవనం కట్టించారు. అలాంటిది అదే భవనంలోకి రెవెన్యూ వ్యవస్థ చేరడం విడ్డూరం. వర్షాలకు స్లాబ్‌కు సపోర్టుగా ఉన్న కర్రలు విరిగిపడుతున్నాయి. పెచ్చులూ ఊడుతున్నాయి.