
జిల్లా పరిషత్ కార్యాలయంలో తుది ఓటర్ జాబితా విడుదల చేస్తున్న అధికారులు
జెడ్పీ, ఎంపీటీసీ స్థానాల వారీగా జాబితా విడుదల
మహిళలే అధికం
నిర్మల్‌చైన్‌గేట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో 18 జెడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 4,49,302 ఓట్లు ఉన్నారు. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 21,680 మంది ఎక్కువగా ఉన్నారు.
పంచాయతీ డివిజన్లు 02
మొత్తం జెడ్పీటీసీ స్థానాలు 18
ఎంపీటీసీ స్థానాలు 157
పోలింగ్ కేంద్రాలు 893
మొత్తం ఓటర్లు 4,49,302
పురుషులు 2,13,805
మహిళలు 2,35,485
ఇతరులు 12